ఉగ్ర‌వాదుల వ‌ద్ద మీడియా కార్డులు

ఎల్ఈటీ ఉగ్ర‌వాదులు మీడియాను అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోతున్నారు. జ‌మ్మూ,కాశ్మీర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఈ విష‌యం తేట‌తెల్లం అయ్యింది. జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్‌పీఎఫ్‌ దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదుల్లో ఒకరి వ‌ద్ద‌ మీడియాకు సంబంధించిన గుర్తింపు కార్డు దొరికింది. మీడియా కార్డుల దుర్వినియోగం జ‌రుగుతోంద‌ని దీనితో స్ప‌ష్టం అవుతోంద‌ని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) వెల్ల‌డించారు. చాలా మంది ఉగ్ర‌వాదులు ఈ మీడియా కార్డుల‌తో తిరుగుతున్నార‌ని వారు తెలిపారు. “నిషిద్ధ ఉగ్రవాద సంస్థ LeTకి చెందిన స్థానిక ఉగ్రవాదుల్లో ఒకరు మీడియా గుర్తింపు కార్డు (ID)ని కలిగి ఉన్నారు. ఇది మీడియా దుర్వినియోగానికి సంబంధించినది: IGP కశ్మీర్, ”అని జమ్మూ కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like