సింగరేణి కార్మికుడి మృతి
మంచిర్యాల:మంచిర్యాల జిల్లా మాదారం టౌన్షిప్లో నరసింహ అనే సింగరేణి కార్మికుడు మరణించాడు. నరసింహ భార్య ప్రస్తుతం కొత్తగూడెంలో ఉంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. సింగరేణి సమ్మె నేపథ్యంలో తాను బయటకి కూడా రాలేదు. పక్కన వాళ్ళకి వాసన రావడం, తలుపులు తీసి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూసారు. నరసింహ చనిపోయి మృతదేహం ఉబ్బిపోయి ఉంది. నరసింహ ఏరియా వర్కుషాప్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.