టీబీజీకేఎస్ గుండాల‌కు ప్ర‌జ‌ల చేతిలో శిక్ష త‌ప్ప‌దు

మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఎన్నికైన త‌ర్వాత ఆ నేత‌ల అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని సికాస కార్యదర్శి ప్రభాత్ ఆరోపించారు. ఆయ‌న గురువారం ఈ మేర‌కు ఒక లేఖ విడుద‌ల చేశారు. ఫిట్ క‌మిటీ స్థాయి నుంచి ఏరియా స్థాయి సెంట్రల్ కమిటీ నాయకుల అరాచాకాలు పెరిగిపోతున్నాయ‌ని దుయ్యబ‌ట్టారు. గోదావరిఖని ఏరియా వర్క్ షాపులో ఫిట్ సెక్రటరీగా ఉన్నస్వామిదాస్ అక్కడ పని చేస్తున్న కార్మికులను, మహిళా కార్మికులను తీవ్రమానసిక క్షోభకు గురిచేస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. గతంలో ఒక కార్మికుడు స్వామిదాన్ వేధింపుల వలన ఆత్మహత్య ప్రయత్నం చేశాడ‌ని తెలిపారు. అధికారుల అండదండలతో త‌నను ఏమి చేయలేరనే అహంకారంతో మహిళ కార్మికులపై కూడ లైంగిక వేధింపులకు పాల్ప‌డుతూ మహిళ కార్మికులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

TRS ప్రభుత్వ హయములో సింగరేణిలో ఎన్నడూ లేని విధంగా మహిళల పట్ల లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని తెలిపారు. కొత్తగూడెం రీజియన్ ఇల్లందులో TBGKS ఏరియా నాయకుడు గడ్డం వెంకటేశ్వర్లు, గోదావరిఖని ఓపెన్ కాస్టులో TBGKS ఫిట్ సెక్రటరి, రామకృష్ణావూర్ ఏరియా హాస్పిటల్లో ఫిట్ సెక్రటరి కృష్ణ, బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో TBGKS కమిటి సభ్యుడైన ఫిట్ సెక్రటరీ కోగిళాల రవిందర్ H. సత్యనారాయణ మహిళ కార్మికుల పట్ల లైంగిక వేధింపులకు గురిచేస్తు అసభ్యంగా ప్రవర్తిస్తు మహిళ కార్మికులను నిత్యం, భయందోళనలకు గురి చేయడం పరిపాటిగా మారిందన్నారు. పదవి అహంకారం, పాలక పార్టీ అండ దండ‌లు, సింగరేణి అధికారుల పరోక్ష మద్దతుతో TBGKS నాయకుల ఆగడాలు, ఆరాచాకాలు, పాపాలు, హిమ పర్వతంలాగా పెరిగి పోతున్నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కార్మికులు, TBGKS గుండాల అరాచాకాలను ఖండించాలని పిలుపునిస్తున్నామ‌న్నారు. గోదావరిఖనిలో మహిళ కార్మికురాలు స్వప్నకు, పూర్తి న్యాయం చేయాలని ఆమెకు రక్షణ కల్పించాలని యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. TBGKS గుండాలకు గతంలో కార్మికుల ద్రోహులకు పట్టిన గతే పడుతుందని కార్మికుల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నామ‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like