మంచిర్యాల ఇంఛార్జి డీసీపీగా అఖిల్ మహాజన్
మంచిర్యాల ఇంఛార్జి డీసీపీగా అఖిల్ మహాజన్ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన రామ గుండం పోలీసు కమిషనరేట్ అదనపు డీసీపీ (పరిపాలన)గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన మంచిర్యాల ఏసీపీగా జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇదివరకు ఇక్కడ డీసీ పీగా పనిచేసిన ఉదయ్ కుమార్ రెడ్డి డిసెంబరు 26, 2021న ఆదిలాబాద్ బదిలీ అయ్యారు. అప్పటి నుంచి రామగుండం పోలీసు కమిష నర్ చంద్రశేఖర్ రెడ్డినే ఇంఛార్జి డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మంచిర్యాల ఏసీపీగా పనిచేసి, పదోన్నతిపై డీసీపీ అడ్మిన్ విధులు నిర్వహిస్తున్న అఖిల్ మహాజన్‌కు మంచిర్యాల డీసీపీగా బాధ్యతలు అప్పగించారు.