హైదరాబాద్ లో ఉగ్ర కలకలం
హైదరాబాద్ లో ఉగ్ర కలకలం
హైదరాబాద్ మరోసారి ఉగ్ర కలకలం రేగింది. గతం నుంచి దేశంలో ఎక్కడా ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు, లింకులు హైదరాబాద్ లో బయటపడేవి. అయితే కొన్నాళ్ల నుంచి దేశంలో ఎక్కడా ఇటువంటి ఉగ్ర కార్యకలాపాలు జరిగినా ఇంటలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తతో ఉగ్రదాడులను భగ్నం చేస్తున్నారు. ఇదే విధంగా తాజాగా ఇంటెలిజెన్స్ అప్రమత్తతతో ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిని అరెస్ట్ చేశారు.
పాతబస్తీకి చెందిన సులేమాన్ అనే ఐసిస్ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్ కు మద్దతుగా, ఐసిస్ భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. సులేమాన్ పేరుతో 20 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు సులేమాన్ ను అరెస్ట్ చేశారు. దేశంలో ఐసిస్ కదలికల్ని నాలుగు రోజుల క్రితం గుర్తించాయి భద్రతా బలగాలు. ఈనేపథ్యంలో హైదరాబాద్ లో సానుభూతిపరుడిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఐసిస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేఖంగా ఐసిస్ తరుపున యుద్ధం చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నాడు. ప్రస్తుతం దేశంలో మూడు ఐసిస్ మాడ్యూల్స్ యాక్టివ్ గా ఉన్నాయని భద్రతా సంస్థలు వెల్లడిస్తున్నాయి.