మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే 6 ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 363 విస్తరణలో భాగంగా ఈ ప్రాంతంలో రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు కలిసి ఇండ్లను కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు అధికారులను అడ్డుకుంటున్నారు. తమలో కొంత మందికే నష్టపరిహారం అందిందని, మరికొందరికి అందలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాకే ఇండ్లను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండ్ల కూల్చివేతను అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు కనీస సమాచారం లేకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకు.న్యాయం జరిగే వరకు రహదారి పనులను అడ్డుకుంటామంటుని ప్రజలు చెబుతున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. స్థానికులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.