పాపం పోలీసులు..

-మ‌రో ఎంఐఎం కార్పొరేట‌ర్ బెదిరింపులు
-ఇక్క‌డ‌ ఇలాగే జ‌రుగుతుంది.. ఏం చేసినా చూస్తూ ఊరుకోవాల‌ని ఆగ్ర‌హం

హైదరాబాద్‌ భోలక్‌పూర్‌లో ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ తాహా బెదిరింపులు, అరెస్టు ఘటన మరవకముందే పోలీసులపై మరో ఎంఐఎం కార్పొరేటర్ విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి పాతబస్తీలో తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది.. ఇక్కడ ఇలాగే జరుగుతుందని.. ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలని పోలీసులపైనే ఫైర్ అయ్యారో ఓ కార్పొరేటర్.. మక్కా మసీదు ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో కార్పొరేటర్ సయ్యద్ సొహైల్‌ ఖాద్రీ రంగంలోకి దిగారు. వాహనాల పార్కింగ్‌ కోసం యునాని హాస్పిటల్‌ గేట్లు తెరిపించాడు. ఈ నేప‌థ్యంలో ట్రాఫిక్ జామ్‌పై కొంద‌రు వ్య‌క్తులు 100కి డ‌య‌ల్ చేశారు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వారు రావడంతో ఆయన కోపంతో ఊగిపోయారు. అసలు మీకు ఇక్కడ ఏం పని.. ఎందుకొచ్చారంటూ ఎస్‌ఐపై నిప్పులు చెరిగారు. ఇక్కడ ఇలాగే జరుగుతుందంటూ చెప్పారు. ఇక్కడ ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.. ఫోన్ వస్తే వచ్చామని పోలీసులు చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. పోలీసులకు యునాని హాస్పిటల్‌ సిబ్బంది ఫోన్‌ చేశారని తెలిసి వారిపై సీరియస్ అయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like