కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నరు
మంచిర్యాల జిల్లా : తినడానికి అన్నం సరిగ్గ పెడతలేరు. కుళ్లిన కోడిగుడ్లు, ఉడకని అన్నం పెడుతున్నని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి మండలం కస్తూరిబా బాలికల హాస్టల్ విద్యార్థినులు రోడ్డెక్కారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుళ్ళిన కోడి గుడ్లు, ఉడకని అన్నం పెడుతున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రత్యేక అధికారి అమూల్యను సస్పెండ్ చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అన్నం సరిగ్గ్ఆ పెట్టడం రెండు రోజులుగా హాస్టల్ లో భోజనం ముట్టక విద్యార్థినులు నిరసన తెలియజేస్తున్నారు. కొంతమంది విద్యార్థినులు కళ్ళు తిరిగి పడిపోవడంతో సహా విద్యార్థినులు ఓఆర్ఎస్ తాగిపించారు.