ఫ్లాష్.. ష్లాష్.. పాఠశాల ఎదుట ఆందోళన
బోథ్ మండలం పొచ్చెరలో పాఠశాల ముందు ఆందోళన కొనసాగుతోంది. సెయింట్ థామస్ పాఠశాల లో విద్యార్థి హనుమాన్ మాల వేసుకున్నాడని దానిని తీసేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆ పిల్లాడిని స్కూల్ లోకి అనుమతించలేదు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. పిల్లాడిని మాల తీసి రమ్మన్నారని స్కూల్ యాజమాన్యం తో హిందూ సంఘ నాయకులు, హనుమాన్ భక్తులు,విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున వాగ్వావాదినికి దిగారు. యాజమాన్యం చాలా సందర్భాల్లో ఇలాగే వ్యవహరించిందని ఆరోపించారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొందరు ఆంజనేయ మాలధారణ చేసిన వారు పాఠశాల భవనంపైకి ఎక్కి కాషా జెండాలు పాతారు.