మహిళా న్యాయవాది ఆత్మహత్య
హైదరాబాద్ లోని చందానగర్ లక్ష్మీవిహార్ ఫేజ్వన్ డిఫెన్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శివాని అనే మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవ కారణంగా లాయర్ శివానీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే…. ఐదేళ్ల క్రితం అర్జున్ తో మహిళా న్యాయవాది శివానీకి వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి భార్య, భర్తల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ వివాదాలు తార స్థాయికి చేరడంతో మహిళా న్యాయవాది శివాని…వారి భవనంపై నుండి దూకి రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఘటన జరుగడంతోనే భర్త అర్జున్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.