వడదెబ్బపై కార్మికులకు అవగాహన
మంచిర్యాల : ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా సింగరేణి కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ జయవాణి స్పష్టం చేశారు. గురువారం ఆర్కేపి సి.హెచ్.పి.లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ నీడపట్టున ఉంటూ, ఎక్కువగా నీళ్ళు తాగాలన్నారు. చల్లనినీటితో గంటకోసారి ముఖం కడుక్కోవాలని సూచించారు. ఎక్కువగా కూరగాయలు, పళ్ళు తింటూ కీరదోస, పుచ్చకాయ, కొబ్బరిబోండాం లాంటివి తీసుకోవాలన్నారు. నిమ్మరసం,మజ్జిగ,ఎలక్టరోల్ లాంటివి తీసుకుంటే మన శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయని సూచించారు. అలాగే ఎండకు పోవాల్సివస్తే తలకు రుమాలు చుట్టుకోవాలని, టోపీ ధరించాలని, కాటన్ డ్రెస్సులనే ధరిస్తే మంచిదన్నారు. కార్యక్రమంలో ఆర్కేపి సి.హెచ్.పి. డీజీఎం బాలాజీ భగవతి ఝా, పిట్ సెక్రటరీలు జే.శ్రీనివాస్, సంజీవ్,ఈ.ఈ.లు మహేందర్,సంతోష్ వైధ్య సిబ్బంది రామ్మోహన్,రవిసాగర్,నరేంద్ర,శ్రీకాంత్,సామల రాజమౌళి,సూపర్ వైజర్స్ గంగాధర్,రమణారావు, మహేందర్, వేణు నాయకులు తిరుపతి,తాల్లపల్లి మల్లయ్య,దండేరమేష్, రాపోలు శ్రీనివాస్,రామారావు, పత్తి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.