భర్త గొంతును బ్లేడ్‌తో కోసింది..
-హనుమకొండలో దారుణం
-బాధితున్ని ఎంజీఎం ఆసుపత్రి తరలింపు
పెండ్లై నెల రోజులు అయ్యింది. ఆ ఇద్దరి మధ్య అప్పుడే గొడవలు ప్రారంభం అయ్యాయి. ఉదయం జరిగిన గొడవలో భార్యకు కోసం వచ్చింది. అంతే విచక్షణ మరిచిన ఆమె భర్తపై బ్లేడ్‌తో దాడి చేసింది. వివరాల్లోకి వెళితే..
హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో ఈ దారుణం చోటుచేసుకుంది. పసరగొండకు చెందిన రాజు, అర్చన దంపతులు. వారికి నెల క్రితమే వివాహం జరిగింది. వీరి మధ్య నెల రోజుల్లోనే మనస్పర్థలు తలెత్తాయి. ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తురాలైన అర్చన రాజుపై దాడికి పాల్పడింది. అక్కడే ఉన్న బ్లేడుతో గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించింది. అదిచూసిన స్థానికులు వెంటనే రాజును వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అర్చనను అదుపులోకి తీసుకున్నారు.