ఘనంగా తైదల బాపు జన్మదిన వేడుకలు
మంచిర్యాల,కరీంనగర్ జిల్లాల్లో సినీ గేయ రచయిత తైదల బాపు 45వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
జాతీయ కళారత్న సినీ గేయ రచయిత, నిర్మాత తైదల బాపు జన్మదినం సందర్బంగా మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. బాపు భవిషత్తులో మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరిన్ని పాటలు రచించాలని ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాల్లో అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..