మంటల్లో లారీ దగ్ధం
కొబ్బరి బొండాల కోసం ఎగబడిన జనం

ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని చందా (టి) గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కొబ్బరి బొండం లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తాపడింది.ఈ ప్రమాదంలో లారీకి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.లారీ బోల్తా పడడంతో లారీ లోని కొబ్బరి బోండాలు అన్ని రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రమాదమని తెలిసి కూడా రోడ్డుపై పడిపోయిన కొబ్బరి బోండాలని తీసుకు వెళ్ళటానికి జనం ఎగబడ్డారు.లారీ ఆంధ్రప్రదేశ్ నుండి మహారాష్ట్రాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోగా, క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి.