దివ్యదేవరాజన్ పేరిట నకిలీ వాట్సప్ ఖాతా

మంచిర్యాల : అధికారుల పేరిట నకిలీ వాట్సప్ ఖాతాలు సృష్టిస్తున్న సైబర్ నేరగాళ్లు వాటిని ఆపడం లేదు. కలెక్టర్లు, జిల్ల ఉన్నత స్థాయి అధికారుల పేరిట నకిలీ వాట్సప్ ఖాతాలు సృష్టించి జిల్లాలో ఉన్న వారికి మెసేజ్లు పంపిస్తున్నారు.
ఈ నకిలీ వాట్సాప్ ఖాతాలు పెరిగిపోతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్లు ఇలా ప్రముఖుల పేర్లతో ఖాతాలు సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఈసారి ఏకంగా రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ పేరిట కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ అధికారికి వాట్సాప్ మెసేజ్ పంపించారు. కొద్ది రోజులుగా కలెక్టర్ల పేరుతో ఇలాంటి మోసాలు జరుగుతుండటం, నిత్యం పత్రికల్లో కథనాలు వస్తుండటంతో ఆ అధికారికి మేడం నంబర్ కాదని తెలిసిపోయింది. దీంతో ఆ సైబర్ నేరగాళ్లు చాటింగ్ ఆపేశారు. వేరే జిల్లాల్లో సైతం మేడం పేరుతో మెసేజ్ లు వచ్చినట్లు సమాచారం.
ఇటీవల ఆదిలాబాద్,నిర్మల్,ఆసిఫాబాద్ కలెక్టర్ ఫొటోలు డిపీ పెట్టీ డబ్బులు అడిగిన సైబర్ నేరగాళ్లు. కలెక్టర్ పేరు, ఫోటోతో వాట్సప్ ప్రొపైల్ సూచించే నెంబర్ నుంచి పలువురు అధికారులకు, ఇతరులకు మేసేజ్లు రావడం కలకలం రేపింది. ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పోలీసులు నకిలీ వాట్సాప్ ఖాతాలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ నంబర్లకు జిల్లా కలెక్టర్కు ఎటువంటి సంబంధంలేదని.. ఎవరికైనా మేసేజ్లు వస్తే నమొద్దని హెచ్చరిస్తున్నారు.