కేసీఆర్ కొత్త పార్టీ.. భారతీయ రాష్ట్ర సమితి
ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పార్టీ పేరు సైతం ప్రకటించారు. హైదరాబాద్లో జరుగుతున్న ప్లీనరి సమావేశంలో మాట్లాడిన ఆయన జాతీయ పార్టీ ప్రస్తావన తీసుకువచ్చారు. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టాలనే సలహాలను చాలా మంది ఎమ్మెల్యేలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు జాతీయ స్థాయిలో భారతీయ రాష్ట్ర సమితి కూడా ఉండాలంటున్నారని కేసీఆర్ అన్నారు. దేశఅభ్యున్నతి కోసం తెలంగాణ నుంచే తొలి అడుగు పడితే అదే తమకు గర్వకారణం అన్నారు సీఎం కేసీఆర్. ఈ దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కావని, ఎవరినో గద్దె దించడం కోసమో, గద్దె ఎక్కించడం కోసమో తాను పనిచేయబోనని స్పష్టం చేశారు. ఇద్దరు సీఎంలతో మాట్లాడి, నాలుగు పార్టీలను జతచేయాల్సిన అవసరమే లేదన్నారు. ప్రజలే ఎజెండాగా ఫ్రంట్లు రావాలన్నారు. అద్భుతమైన దేశ నిర్మాణానికి ప్రక్రియ మొదలు కావాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్.