ఆచార్య హిట్టా…? ఫట్టా…?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై అభిమానులలో ఏ రకమైన అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీఎంట్రీ తర్వాత చిరు సినిమాలపై అభిమానులు ఆసక్తి బాగా చూపుతున్నారు. తాజాగా చిరంజీవి ఆచార్య చిత్రంతో ప్రేక్షకులని అలరించేందుకు వచ్చాడు. ఇందులో రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్ర పోషించడంతో జనాలు సినిమా చూసేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. సహజంగా కొరటాల శివ (Koratala Siva)కథలు బలంగా ఉంటాయి. ట్విస్ట్స్,టర్న్స్ కి ఆయన అంతగా ప్రాధాన్యత ఇవ్వకున్నా ప్రేక్షకుడిని తన కథనంలో ఇన్వాల్వ్ చేస్తారు. ఆచార్య చిత్రానికి అది మిస్ అయ్యింది. బలహీనమైన కథనం ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో థ్రిల్ చేయలేకపోయింది. ఇద్దరు స్టార్ హీరోలలో ఒక్కరికి కూడా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించే సన్నివేశాలు లేవు. ఎలివేషన్స్ విషయంలో కొరటాల న్యాయం చేయలేకపోయారన్న మాట వినిపిస్తుంది.
ఈ సినిమా ఫస్ట్ డే బుకింగ్స్ మెగా ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టు లేదనే టాక్ ప్రీ బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర తండ్రీ తనయులు రచ్చ మాత్రం అనుకున్నంత రేంజ్లో లేదని తెలుస్తోంది. టిక్కెట్స్ రేట్స్ హైక్గా ఉండటం.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల హైప్‌తో పోలిస్తే తక్కువగా ఉందని అంటున్నారు. ఫ్లాట్ నేరేషన్ కారణంగా కథ, కథనాలు ప్రేక్షకులు అంచనా వేసేలా ఉన్నాయి. రెండు సాంగ్స్, ఒకటి రెండు యాక్షన్ సన్నివేశాలు మాత్రం అలరిస్తాయి. మొత్తంగా సగటు ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా ఆచార్య లేదనేది కొందరి అభిప్రాయం. ఇక ఈ మూవీ అసలు ఫలితం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
చిత్ర కథలోకి వెళితే..
ధర్మస్థలిలోని గురుకులంలో పెరిగి పెద్ద అయిన సిద్ధ( రామ్ చరణ్) వారి సంప్రదాయాలు,విలువల నేర్చుకుంటాడు. అక్కడ వారికి అండగా ఉంటాడు. సిద్ధ ధర్మాన్ని బలంగా నమ్మే వ్యక్తి. అయితే ధర్మస్థలి గ్రామంపై బసవ(సోనూసూద్) కన్ను పడగా, దానిని వశం చేసుకోవాలని భావిస్తాడు. వారి ఆగడాలకు సిద్ధ చెక్ పెడతాడు. అయితే అనుకోని కారణాల వల్ల సిద్ధ ధర్మస్థలి ని అక్కడి గ్రామస్థులని విడిచిపెట్టి వెళ్లవలసి వస్తుంది. ధర్మస్థలిని విడిచిపెట్టి వెళ్లిన తరువాత అక్కడి ప్రజలకు సమస్యలు మొదలవుతాయి .అప్పుడే వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు ఆచార్య. అప్పుడు సిద్ధ, ఆచార్యకు ఏం చెబుతాడు, సిద్ధకు ఎలాంటి సమస్యలు మొదలవుతాయి? ఆచార్య సిద్ధ మధ్య సంబంధం ఏమిటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్: ఆచార్య చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ తమ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. ఆచార్య,సిద్ధ పాత్రలలో వారు సినిమాకి హైప్ తెచ్చే ప్రయత్రం చేశారు. విలన్‌గా సోనూసూద్ న్యాయం చేశాడు. సిద్ద సరసన కథానాయికగా నటించిన పూజా హెగ్డే ఉన్నంత మేర అలరించింది. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, నాజర్, అజయ్, తనికెళ్ల భరణి నటన బాగుంది. స్పెషల్ సాంగ్‌లో రెజీనా తన అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకి థ్రిల్ కలిగేలా చేస్తుంది. మహేష్ బాబు తన వాయిస్ ఓవర్‌తో సినిమాలోకి తీసుకెళ్లడం కొంత ఆకర్షించే విధంగా ఉంటుంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ తీశారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు.