కార్మికుల సమస్యలను పరిష్కరిస్తం
TBGKS ఏరియా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి
కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు శ్రమిస్తామని TBGKS ఏరియా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు RK-7 గనిలో లో అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా ఆయన కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున సమస్యలను అడిగి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ లైన్మెన్ కార్మికులు రెగ్యులర్‌గా వచ్చే కార్మికులకు ఇవ్వడం లేదని, యాక్టింగ్ వచ్చేవారికి యాక్టింగ్ కొట్టడం లేదన్నారు.
లైన్మేన్లకు గిర్మిట్ సరిగా ఇవ్వడం లేదని,చేతి గ్లవుజులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టిమ్మరింగ్ కార్మికుల గ్యాంగ్‌లో సీనియర్లను కేటాయించడం లేదన్నారు. ట్రామర్ కార్మికులకు చేతి గ్లవుజులు ఇవ్వడంలేదన్నారు. దీంతో వెంటనే సమస్యలను గని మేనేజర్ సాయిప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడారు. దీనిపై సానుకూలంగా స్పందించి ఇక మీదట అలా జరగకుండా చూస్తామని మేనేజర్ హామీ ఇచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, ఏరియా GM కమిటీ మెంబర్స్ పెట్టం లక్ష్మణ్,వెంగల కుమారస్వామి,పిట్ సెక్రెటరీ మెండవెంకటి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ప్రేమ్‌కుమార్,సీ రిలేషిఫ్ట్ సెక్రెటరీ భూమయ్య, సతీష్,కుమారస్వామి,కిష్టయ్య,బాపు,శ్రావణ్ పాల్గొన్నారు.