అంగన్‌వాడీలకు వేసవి సెలవులు

మంచిర్యాల : అంగన్‌వాడీలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్క్యులర్ నంబర్ 847 జారీ చేసింది. మే 1 నుంచి 30 వరకు ఈ సెలవులు ప్రకటించారు. అయితే సెలవులు మే 1 నుంచి 15 వరకు అంగన్‌వాడీ టీచర్లు, 16వ తేదీ నుంచి 30 వరకు అంగన్‌వాడీ వర్కర్లకు ఈ సెలవులు వర్తించనున్నాయి. ఈ నెలకు సంబంధించి సరుకులు లబ్ధిదారులకు పంపిణీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. దీనికి సంబంధించి జిల్లా సంక్షేమ శాఖ అధికారి, సీడీపీవో, సూపర్‌వైజర్లకు బాధ్యతలు అప్పగించారు.