కళాశాల కోసం సింగరేణి పాఠశాల పరిశీలన

మంచిర్యాల : తాండూరు మండలం మాదారం టౌన్షిప్ సింగరేణి పాఠశాలను బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి పరిశీలించారు. ఇందులో గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జీఎం ఆ పాఠశాలను సందర్శించారు. ఇక్కడ సింగరేణి పాఠశాల భవనం పదిహేను సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంటోంది. దీనిని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలగా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. జీఎం సంజీవరెడ్డి వెంట డిప్యూటీ GM సతీష్ బాబు, ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి ఉపాధ్యాయురాలు ఉషారాణి ఉన్నారు.