ఎండవేడికి కాలిపోయిన బుల్లెట్
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎండ వేడికి పార్క్ చేసిన ఓ బుల్లెట్ బైక్ కాలిపోయింది. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ టాకీస్ రోడ్ లో ఎండవేడికి పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్దం అయ్యింది. అయితే బైక్ ఎండ వేడికి కాలిపోయిందా..? లేక పార్ట్ సర్క్యూట్ అయ్యిందా..? అని ఆరా తీస్తున్నారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో బైక్లను ఎండలో పార్క్ చేయవద్దని నిపుణులు చెబుతున్నారు.