తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా…

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఆయన పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణలో ఆయన పర్యటన సాగుతుంది ఇలా…
మే 6న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు రాహుల్ గాంధీ..
అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో వరంగల్ వెళ్తారు.
వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు..
రాహుల్ గాంధీ ముఖ్య నాయకులకు ఒకే వేదిక…రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక..
7 గంటల వరకు ముఖ్య నేతల ప్రసంగం..
7 గంటలకు రాహుల్ ప్రసంగం ప్రారంభం..
సభ తరువాత రోడ్డు మార్గాన హైదరాబాద్ కు చేరుకోనున్న రాహుల్ గాంధీ..
దుర్గం చెరువు పక్కన ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ లో రాహుల్ బస..
7 వ తేదీ ఉదయం హోటల్ కోహినూర్ లో ముఖ్య నాయకులతో అల్పాహారం..
అక్కడి నుండి మొదట సంజీవయ్య పార్క్ కి వెళ్లి నివాళి..
అక్కడ నుండి నేరుగా గాంధీ భవన్ కు రాహుల్ గాంధీ..
అక్కడ దాదాపు 300 మంది ముఖ్య నాయకుల తో సమావేశం..
డిజిటల్ మెంబర్షిప్ ఎన్ రోలెర్స్ తో ఫొటో సెషన్…
ఆ తరువాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ గాంధీ లంచ్
అనంతరం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ద్వారా ఢిల్లీ కి తిరుగు ప్రయాణం..