గనిలో దిగి.. సమస్యలు తెలుసుకుని…
- RK-6 గని లో దిగిన మిర్యాల రాజిరెడ్డి - కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ

మంచిర్యాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని TBGKS ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన భూగర్భ గనిలోకి దిగి పని స్థలాలను పరిశీలించి, అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ RK-6 గనిలో వెంటిలేషన్ సమస్య ప్రధానంగా ఉందన్నారు. మ్యాన్ రైడింగ్ ప్రారంభించకపోవడంతో కార్మికులు ఆలస్యంగా బయటకు వస్తున్నారని అన్నారు. ఒకవేళ కార్మికులు లేటుగా అవుట్ పడితే వారికి ఒక గంట ఓటి కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లైన్ మెన్ కార్మికుల పై పని భారం ఎక్కువగా మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్లేడే సందర్భంగా మ్యాన్ రైడింగ్ నడిపించాలని కోరారు. జనరల్ షిఫ్ట్లో ప్లేడే లు పెంచాలన్నారు.
కార్యక్రమం లో ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగురవీందర్ రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి,పెట్టంలక్ష్మణ్,పానుగంటి సతయ్య,గని ఫిట్ కార్యదర్శి చిలుములరాయమల్లు, అసిస్టెంట్ సెక్రటరీ భూమయ్య, అన్వేష్ రెడ్డి,గోల్కొండ లక్ష్మినారాయణ, పొగకు రమేష్,ముత్యాల రమేష్ రామటెంకి మల్లయ్య,పానుగంటి తిరుపతి,ఆరుముళ్ళ మల్లయ్య,భీమ్ నాయక్,రాజిరెడ్డి,మనిదర్ రెడ్డి పాల్గొన్నారు.