పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి గా సైదం వెంకటేష్
మంచిర్యాల :పీఆర్టీయూ టీఎస్ భీమిని మండల ప్రధాన కార్యదర్శిగా సైదం వెంకటేష్ ఎంపికయ్యారు.మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ ఎంపిక చేసారు. సైదంవెంకటేష్ అక్కలపల్లి,ప్రాథమికోన్నత పాఠశాలలో చేస్తున్నారు. తనపై నమ్మకం ఉంచి మండల ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు జిల్లా అధ్యక్షులు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొట్టే శంకర్, ఎన్నికకు సహకరించిన ఆవునూరి తిరుపతికి వెంకటేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే భీమిని మండల PRTU ప్రాథమిక సభ్యులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం లో ముందుటానని వెల్లడించారు.