500 కిమీ నుంచి వచ్చి… చెప్పుతో చితక్కొట్టింది..
ఆ యువకుడితో పరిచయం పెంచుకుంది.. అడ్రసు తెలుసుకుంది.. దాదాపు 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వచ్చి మరీ చెప్పుతో చితక్కొట్టింది..
కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన షాన్‌వాజ్ అనే యువకుడు ఓ యువతిని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వేధిస్తున్నాడు. అసభ్యకర కామెంట్లు పెడుతున్నాడు. ఆగ్రహాన్ని మనసులోనే దాచుకున్న యువతి యువకుడితో పరిచయం పెంచుకుంది. కలుద్దామని చెప్పి అడ్రస్ కనుక్కుంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి కర్నూలు జిల్లాలోని యువకుడి సొంతూరు ఆలూరుకు వచ్చింది. దాదాపు 500 పైచిలుకు కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి వచ్చింది.
వచ్చీ రాగానే చెప్పు అందుకొని షాన్‌వాజ్‌ను చితకబాదింది. ఆడవాళ్లంటే అంత చులకనా అంటూ చెప్పుతో చితక్కొట్టింది. అడ్డుకోబోయిన యువకుడి కుటుంబసభ్యులకు కూడా చెప్పుదెబ్బలు తప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చినా యువతి చెప్పుదెబ్బలు మాత్రం ఆపలేదు. ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంత దూరం వచ్చి దైర్య సాహసాలు ప్రదర్శించిన ఆ యువతిని అందరూ మెచ్చుకుంటున్నారు.