కాంగ్రెస్ వస్తేనే కష్టాలు దూరం
రైతు సంఘర్షణ సమితి సభ పోస్టర్ల ఆవిష్కరణ
మంచిర్యాల : కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే కష్టాలు దూరం అవుతాయని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పూదరి తిరుపతి అన్నారు. గురువారం రాహుల్ గాంధీ పాల్గొననున్న రైతు సంఘర్షణ సమితి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ సభలో రాహుల్గాంధీ పాల్గొననున్నారని తెలిపారు. సభకు మంచిర్యాల జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో తరలివెల్లనున్నట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీరని ద్రోహం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో అనుసరిస్తున్న ధ్వంద ప్రమాణాలను విడనాడాలని హితవుపలికారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ సంజీవ్, జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ వడ్డే రాజమౌళి, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బాణేష్, మహిళ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు, కౌన్సిలర్ సల్ల మహేష్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేర్ పవన్, మహిళా పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత ,పట్టణ ఉపాధ్యక్షులు జోగుల సదానందం, కొండ శేఖర్,దాసరి లచ్చన్న,పెంట రమేష్, ఓన్నోజుల శ్రీనివాస్,ఆది సంజీవ్, గట్టు స్వామి, తోట సంతోష్,ప్రకాష్,రమేష్,సత్యం,సాయి,శంకర్, షకీల్, అంజాద్,ఫర్వేజ్,సుధీర్,అజయ్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.