ఏం మాట్లాడాలి..?

-రాహుల్ గాంధీపై ట్రోలింగ్
-ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఈ మ‌ధ్య కాలంలో రాహుల్ ఏది చేసినా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత కాడంతో స‌హ‌జంగానే ఆయ‌న‌పై ఫోక‌స్ ఉంటుంది. దీంతో ఆయ‌న ఏ ప‌ని చేసినా..? ఏం మాట్లాడినా.. అది వార్తే. ఈ నేప‌థ్యంలో ని్న్న రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌లో స‌భ‌కు ముందు ఆయ‌న మాట్లాడిన మాట‌లు సంచ‌ల‌నంగా మారాయి. దీనిని టీఆర్ఎస్ నేత‌లు సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. స‌భ‌కు ముందు తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌లో పాల్గొన్నారు. అంత‌కుముందు వరంగల్‌లోని హోటల్‌ లో కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ఇవాల్టి థీమ్‌ ఏంటీ? ఏం మాట్లాడాలంటూ నేతలను రాహుల్ అడిగారు. ఈ వీడియో టీఆర్ఎస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది. వరంగల్ సభ దేని గురించే తెలియదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. రైతుల గురించి రాహుల్‌కు క‌నీసం అవ‌గాహ‌న లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కేవ‌లం ఎక్క‌డిక్క‌డ నేత‌లు చెబితే, స్క్రిప్ట్ రాసి ఇస్తే రాహుల్ మాట్లాడ‌తార‌ని లేక‌పోతే లేద‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి జాతీయ స్థాయి నేత‌లు ఏదైనా ప‌ర్య‌ట‌లన‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డి ప‌రిస్థితులు ముందుగానే తెలుసుకోవ‌డం, స్థానిక నేత‌ల ద్వారా ఏం మాట్లాడాలో ఆరా తీస్తారు. స్థానిక ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లుగా ఆ నేత‌ల ప్ర‌సంగం ఉంటుంది. అయితే రాహుల్‌గాంధీ నేత‌ల‌ను అడిగిన‌ప్పుడు మీడియా అక్క‌డే ఉండ‌టం ఆ వీడియో లీక్ కావ‌డంతో అది కాస్తా ట్రోలింగ్ చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like