దళారులను నమ్మి మోసపోవద్దు

మంచిర్యాల :వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోస పోవద్దని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు స్పష్టం చేశారు. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. రైత బంధు, రైతుబీమా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని స్పష్టం చేశారు.