డైరెక్టర్ (పర్సనల్)కి అభినందనలు
మంచిర్యాల : సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసిన సందర్భంగా INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ డైరెక్టర్ (పర్సనల్) బలరాంనాయక్ ని కలసి అభినందనలు తెలిపారు. బుధవారం ఆయనను కలిసిన జనక్ ప్రసాద్ సింగరేణిలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ST ఖాళీలను భర్తీ చేసినందుకు డైరెక్టర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా సింగరేణిలో ఉన్న పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గత నెల 20 తేదీన జరిగిన RLC సమక్షంలో జరిగిన అగ్రిమెంట్ వెంటనే అమలు చేయాలని కోరారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న వర్కమెన్ ఖాళీలను భర్తీ చేయాలని అందులో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95% స్థానికులకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రామగుండం రీజియన్ లో రక్షిత మంచినీటి సరఫరా గురించి గతంలో ఇచ్చిన వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జనక్ ప్రసాద్ తో పాటు INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ S.నరసింహ రెడ్డి, జనరల్ సెక్రెటరీ P.ధర్మపురి, కేంద్రకమిటీ క్యాంపెనింగ్ ఇంచార్జ్ వికాస్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.