అంగన్‌వాడీలు.. హ్యాట్సాప్

అనాథ శవంలా పడి ఉన్న ఓ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా దగ్గరుండి పాడె మోసిన అంగన్వాడీలు ఇప్పుడు అందరి చేత హ్యాట్సాప్ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నంలో అన్నెం సౌజన్య అనే వివాహిత బుధవారం రాత్రి మరణించింది. ఈ విషయం తెలిసినా భర్త ఆమె అంత్యక్రియలు చేయడానికి రాలేదు. ఇక బంధువులు సైతం ఆమె శవాన్ని చూసేందుకు సైతం కనీసం రాలేదు. దీంతో రాత్రంతా అనాథ శవంలా పడి ఉన్న ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగన్వాడీలు ముందుకు వచ్చారు. సౌజన్యకు అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. చివరకు పాడె కూడా వాళ్లే మోసారు.