రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

మంచిర్యాల :శుభకార్యానికి హాజరై వస్తున్న దంపతులను లారీ ఢీకొనడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్య తీవ్ర గాయాలపాలైన సంఘటన గురువారం రాత్రి జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ అటవీ శాఖ చెక్‌పోస్టు సమీపంలో లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో దాసరి రాజు(38) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య గౌతమి తీవ్రంగా గాయపడింది. సుల్తానాబాద్ మండలం శివపల్లికి చెందిన రాజుకు గోదావరిఖనికి చెందిన గౌతమితో కొద్దికాలం కిందట వివాహమైంది. హైదరాబాద్‌లో ఉద్యోగరీత్యా నివాసం ఉంటున్నారు. మంచి ర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు గోదావరిఖని చేరుకున్న వీరు ద్విచక్రవాహనంపై వెళ్లి రాత్రి తిరిగివస్తుండగా జైపూర్ అటవీ శాఖ చెక్ పోస్ట్ వద్ద లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డ రాజు అక్కడిక క్కడే మృతి చెందాడు. గౌతమిని 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వారి కుమార్తె(3) స్వల్పంగా గాయపడింది.బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.