నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కొమురం భీమ్ ఆసిఫాబాద్ : కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకున్నారు. పోలీసులు రెక్కీ నిర్వహించి పట్టుకున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ అచేశ్వర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు మహారాష్ట్ర నుంచి కోమర భీం జిల్లాలోని కౌటల, వాంకిడి మండలాల గుండా జిల్లాలోకి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు రెక్కీ నిర్వహించామన్నారు. ఈ మేరకు 2 క్వింటాళ్ల 73 కిలోల నకిలీ విత్తనాలు సుమారు ఐదు లక్షల అరవై వేలు విలువగల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నామని వెల్లడించారు. ఈ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించి పట్టుకొన్న రెబ్బెన మండల CI నరేందర్,ఎస్ఐ భవాని సేన్ తోపాటు పోలీసు సిబ్బందిని అడిషనల్ ఎస్పీ అచేశ్వరరావు, డి.ఎస్.పి శ్రీనివాస్ అభినందించారు.