కన్నుల పండువగా పద సంచలన్

రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పదసంచలన్ కన్నుల పండువగా సాగింది. శనివారం భాగ్యనగరంలోని మైలారదేవపల్లి బస్తి పురవీధుల గుండా శోభాయాత్ర,పదసంచలనం నిర్వహించారు. A.R.R మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో మే 7 నుండి 22వరకు శిక్ష వర్గ నిర్వహించారు. దీనిలో 445 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. అనంతరం ఈ పద సంచలనం నిర్వహించారు. గణవేషధారి సేవికలు భగవాధ్వజాన్ని చేతబూని ఘోష్ వాదనతో మైలార్ దేవ్ పల్లి పురవీరులతో శోభాయమానంగా పదసంచలన నిర్వహించారు. సేవికలు అడుగులో అడుగు కలుపుతూ దేశరక్షణలో మేము సైతం ముందుటామని ప్రదర్శన నిర్వహించారు. పదసంచలన్ జరుగుతుండగా ప్రజలు పుష్పార్చనతో స్వాగతించారు.హారతులు పట్టారు. సుమారు 2.5 కిమీ మారం సాగిన ఈ పదసంచలనం అందరిని ఆకట్టుకుంది. ఈ పధసంచలన్లో తెలంగాణ ప్రాంత కార్యవాహిక పాదరాథ, ప్రాంత సహకార్యహిహిక షహర్ జ్యోతిర్మయిగారు, ఇతర ప్రాంత, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.