నిర్మల్ జిల్లాలో నకిలీ మద్యం తయారీ
-తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు
-భారీగా కల్తీ మద్యం స్వాధీనం
నిర్మల్ :నిర్మల్ జిల్లా పెంబిలో నకిలీ మద్యం తయారీ వ్యక్తి గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్‌శాఖ అధికారులు .. దాడుల్లో భారీగా కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలో నకిలీ మద్యం తయారీ సాగుతోందని అధికారులకు సమాచారం అందింది. ఇంట్లో కల్తీ మద్యం తయారీ చేస్తున్న వ్యక్తిపై ఎక్సైజ్ అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎక్సైజ్అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో నరేష్ ఇంట్లో మద్యం బాటిళ్లు, ఖాళీ క్వాటర్, హాఫ్ బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం ఫుల్ బాటిళ్లు అన్ని బ్రాండ్స్ దొరికాయని వాటిని చిన్న బాటిళ్లలో కల్తీ చేసి నింపుతున్నట్టు ఆధారాలు ఉన్నాయని, అతనిపై కేసు నమోదు చేస్తామని ఎక్సైజ్ శాఖ CI సంపత్ కృష్ణ అన్నారు. నిందితుడు నరేష్ నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఉన్న MSR వైన్స్ లో వర్కర్ గా పని చేస్తున్నాడు.