జిల్లా పౌర సంబంధాల అధికారిగా వై.సంపత్ కుమార్
పెద్దపల్లి : జిల్లా నూతన పౌర సంబంధాల అధికారిగా వై. సంపత్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సంపత్ కుమార్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా పెద్దపల్లి డీపీఆర్ఓ పోస్టు ఖాళీగా ఉంది.సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఆయనకు పెద్దపల్లి జిల్లా పౌర సంబంధాల అధికారి గా అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో సంపత్‌కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణను కలెక్టరేట్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.