ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్దాం..

-మందమర్రి ఏరియా GM చింతల శ్రీనివాస్
-కేకే1 గనిలో కార్మికుల‌కు బ‌హుమ‌తులు అంద‌చేత‌

మంచిర్యాల : మ‌ందమ‌ర్రి ఏరియాలోనే బొగ్గు ఉత్పత్తిలో కేకే1 గ‌ని నిల‌వ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని మంద‌మ‌ర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ స్ఫ‌ష్టం చేశారు. శుక్ర‌వారం గ‌నిపై అధికోత్ప‌త్తి సాధించిన సంద‌ర్భంగా కార్మికుల‌కు బ‌హ‌మతులు అందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేకే1 గనికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంద‌న్నారు. అధికోత్పత్తి సాధించిన ఘ‌న‌త కేకే1 కి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే కేకే1 గని ఉత్ప‌త్తిలో కూడా నంబ‌ర్ వ‌న్‌గా ఉండడం గర్వకారణం, సంతోషకరమైన విషయమ‌న్నారు. గని మేనేజర్ G.లక్ష్మీనారాయణ అధికోత్పత్తి సాధించ‌డంలో కార్మికులను ఎంతగానో ప్రోత్సహించారని స్ప‌ష్టం చేశారు. గ‌నిమేనేజ‌ర్‌తో పాటు ఎంతగానో కష్టపడి, శ్రమించి అధికోత్పత్తి సాదించిన KK1 B రిలే కార్మికులు, ఓవ‌ర్‌మెన్లు, సర్దార్ల‌కు జీఎం అభినందనలు తెలిపారు. ఇలాగే రక్షణతో పనిచేసి ఎల్లప్పుడు KK1 నంబర్ 1 స్థానంలో ఉండాలని కోరారు. ఈ సంద‌ర్భంగా కార్మికుల‌కు బ‌హుమ‌తులు అందించారు. సీనియ‌ర్ అండ‌ర్ మేనేజ‌ర్ ఇంద్రసేన,ఓవర్మెన్లు రమేష్ నాయక్,పుట్ట మహేష్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో ఏరియా ఏజెంట్ ఆఫీసర్ G.రామచందర్, మేనేజర్ G. లక్ష్మీనారాయణ,సేఫ్టీ అధికారి సీహెచ్‌.ర‌మేష్‌,అస్టిసెంట్ మేనేజ‌ర్ కృష్ణప్రసాద్,వెల్ఫేర్ అధికారి సంఘమిత్ర,టీబీజీకేఎస్‌ వైస్ ప్రెసిడెంట్ మెడిపెల్లి సంపత్,బడికలసంపత్,పెండ్రి రాజారెడ్డి,M.ఈశ్వర్,పోలు సంపత్,D.శ్రీనివాస్,సంగి రవికుమార్,ఏఐటీయూసీ నేత సాంబ‌య్య తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like