సర్పంచుల ఆందోళన

నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్పంచులు ఆందోళన నిర్వహించారు. తమకు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. నిర్మల్ జిల్లా సర్పంచులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఐదో విడత పల్లె,పట్టణ ప్రగతి సమీక్ష సమావేశం నిర్వహించడానికి మంత్రి వేదికకు రాకుండా సర్పంచుల సంఘం ప్రయత్నించింది. నిర్మల్ జిల్లాలోని మొత్తం సర్పంచ్లు వేదిక ముందు కూర్చుని నినాదాలు చేశారు. అయితే జెడ్పి చైర్పర్సన్ భర్త రామకృష్ణారెడ్డి సర్పంచ్ లతో మాట్లాడారు. దీంతో సమావేశశం సజావుగా నిర్వహించారు.