బీజేపీ నేతను పరామర్శించిన బాల్క సుమన్

మంచిర్యాల : ఇటీవల ప్రమాదానికి గురై గాయాలపాలైన బీజేపీ జిల్లా కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు…? త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీలకు అతీతంగా వెళ్లి బీజేపీ నేతను పరామర్శించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రెండో రోజు సైతం బాల్క సుమన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. భీమారం మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించే యాదవ కమ్యూనిటీ భవనంతో పాటు రూ.5 లక్షలతో నిర్మించే బంజారా కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరణించిన కార్యకర్తలు, నేతల కుటుంబాలను పరామర్శించారు.