పెళ్లి ఆపాలనే ప్రయత్నంలో.. నవ వధువు మృతి
విశాఖపట్నంలోని మధురవాడలో జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో పెళ్లి పీటలపైనే నవ వధువు సృజన మృతిపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన తన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
నవ వధువు సృజన, మోహన్ అనే యువకుడిని ప్రేమించింది. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుంచే వీరి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెళ్లికి మూడు రోజుల ముందు ముందే మోహన్‌తో సృజన ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసింది. ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని సృజన ప్రతిపాదించగా.. తనకిప్పుడు సరైన ఉద్యోగం లేదని, పెళ్లికి రెండేళ్ల సమయం కావాలని మోహన్ అడిగాడు. దీంతో ఎలాగైనా ఈ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నం చేస్తానని ప్రియుడితో సృజన చెప్పింది.
ఇందులో భాగంగానే పెళ్లి ఆపడం కోసం సృజన విషం సేవించింది. అయితే ఆ డోస్ ఎక్కువై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. ఇక, మోహన్‌తో చాటింగ్ తర్వాత ఫోన్ డేటా డిలీట్ చేసింది. కాల్ డయల్ రికార్డర్ ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు.