రూ.200 కోట్ల క్లబ్లో ‘సర్కారు వారి పాట’..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విజయవంతమైన టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. 12 రోజుల్లో ‘సర్కారు వారి పాట’ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో 2022లో భారీ విజయం సాధించిన తెలుగు చిత్రంగా ఇండస్ట్రీలో మహేష్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.122.09 కోట్లు షేర్ వసూళ్లు వచ్చాయి.
‘సర్కారు వారి పాట’ సాధించిన రూ.122.09 కోట్ల రూపాయల షేర్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచే రూ.100 కోట్లు వచ్చాయి. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలుపుకుని రూ.8.63 కోట్లు వచ్చాయి. ఇక ఓవర్ సీస్లో రూ.13.45 కోట్లు వచ్చాయి. ఇక గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో రూ.156.9 కోట్లు రాగా.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలుపుకుని 15.3 కోట్లు వచ్చాయి. ఇక ఓవర్ సీస్లో 27.8 కోట్లు. గ్రాస్ వసూళ్ల ప్రకారం ‘సర్కారు వారి పాట’ 12 రోజుల్లోనే 200 కోట్ల మైలు రాయిని టచ్ చేయడం విశేషం.
కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈచిత్రంలో సముద్ర ఖని విలన్‌గా నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందించారు. పది వేల కోట్ల రూపాయలను ఓ బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న విలన్ కట్టుకుండా తప్పించుకుంటుంటే హీరో అతనికి ఎలా బుద్ధి చెప్పి అప్పు కట్టించారనేదే సినిమా కథాంశం.