రిమ్స్‌లో జూడాల సమ్మె హెచ్చరిక
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని జూడాలు అందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి దాదాపు ఏడు నెలల నుంచి స్టైఫండ్ రావడం లేదు. దీంతో రిమ్స్ కు వచ్చిన కలెక్టర్ కు జూనియర్ డాక్టర్లు ఈ విషయాన్ని విన్నవించారు. ప్రభుత్వం దిగిరాక పోతే విధులు బహిష్కరించి ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు సమస్య పరిష్కారించకపోతే రేపటి నుంచి సమ్మె లోకి వెళ్తామని జూ డాలు హెచ్చరించారు.