ఏలేటీ దీక్ష భగ్నం
నిర్మల్ జిల్లా : నిర్మల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఒక్క రోజు దీక్ష పోలీసులు భగ్నం చేశారు. మున్సిపాలిటీలో నాలుగవ తరగతి ఉద్యోగాలు అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ దీక్షను విఫలం చేసేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. మొదట ఏలేటి మహేశ్వర రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మహేశ్వర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొంత మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లను సైతం పోలీసులు తొలగించారు.