ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేత
-విచారణకు ఆదేశించిన కలెక్టర్
-విచారణాధికారిగా నిర్మల్ ఆర్డీవో
-సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించాం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్:నిర్మల్ మున్సిపాలిటీలోని పీహెచ్‌సీ వర్కర్ల నియామక వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగల భర్తీ ప్రక్రియ నిలిపివేస్తున్నాం… దీనిపై విచారణకు ఆదేశించాం.. విచారణాధికారిగా నిర్మల్ ఆర్డీవోను నియమించామని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించాం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ మున్సిపాలిటీలో పీహెచ్సీ వర్కర్ల నియామక ప్రక్రియ నిలిపివేస్తునట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. క్యాంప్ ఆపీస్లో మీడియాతో మాట్లాడుతూ నిర్మల్ మున్సిపాలిటీలో పీహెచ్సీ వర్కర్ల నియామకాలపై కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుమంత్రి తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ కలెక్టర్ కు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. నివేదిక అందిన వెంటనే దాన్ని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.