యాప్ వలలో పడకండి
రామగుండం పోలీస్ కమిషనర్చంద్రశేఖర్ రెడ్డి
అత్యాశతో ఎక్కువ డబ్బులు పొందాలనే ఆలోచన పెట్టుకోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్చంద్రశేఖర్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాలపై శనివారం కమిషనర్ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్‌ల యుగం నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మోసపోతారని అన్నారు. కొత్త కొత్త పద్ధతులతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. ఓటీపీ, సీవీవీ, బ్యాంక్ వివరాలు ఇతరులకు చెప్పవద్దని అన్నారు. గుర్తింపు లేని ఆన్‌లైన్ యాప్‌ల వలకు చిక్కి అప్పులు తీర్చలేక కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొందరు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నారని అన్నారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు సామాన్యులు, జల్సాలకి అలవాటు పడి, వ్యసనాలకి బానిసై కొందరు ఈ లోన్ యాప్ ఊబిలో చిక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులను యుట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో లోన్స్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. రుణ యాప్‌లు చాలా వరకు ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధగా ఉన్నాయని తెలిపారు. ఆర్బీఐ వద్ద నమోదు కాని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవొద్దని రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఇన్‌స్టెంట్ లోన్ల పేరుతో నమ్మించే యాప్ లను నమ్మి మోసపోవద్దని, ఆ యాప్‌ల నుంచి ఇప్పటికే రుణాలు పొందినవారు వేధింపులకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టిపరిస్థితుల్లో ఎవరికి ఇవ్వరాదని, లోన్ యాప్ ల వలన ఫోన్ లోని వ్యక్తిగత, విలువైన సమాచారం, ఫోన్ కాంటాక్ట్స్, ఫోటోలు తీసుకుని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని హెచ్చరించారు. యాప్‌ల ద్వారా అందించే రుణాల వడ్డీ రోజుకు ఒక శాతం వరకు ఉంటుంది. ఇది సాధారణంగా బ్యాంకులు ఇచ్చే రుణ వడ్డీల కన్నా చాలా ఎక్కువని తెలిపారు. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ 2, 3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తారని లోన్ యాప్‌ల బెదిరింపులు, నోటీసులకు బాధితులు భయపడకుండా ధైర్యంగా ఉండాలని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.