మున్సిపల్ సమావేశంలో నిరసన

మంచిర్యాల: తమ వార్డు సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని 23వ వార్డు కౌన్సిలర్ రామగిరి బానేష్ నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సరం పెట్టిన కాలువ పనులను ఇప్పటివరకు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓటేసి గెలిపించిన ప్రజలకు తానేం సమాధానం చెపాలని ప్రశ్నించారు. అధికారులు, మున్సిపల్ చైర్మన్, కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారించాలని నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.