రామగుండంలో యూరియా ఉత్పత్తి నిలిపివేత
రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిపివేయాలంటూ, ఆర్ఎఫ్సీఎల్ కు కాలుష్య నియంత్రణ మండలి భారీ షాక్ ఇచ్చింది. 12 లక్షల గ్యారంటీని జప్తు చేసింది. పబ్లిక్ హియరింగ్లో ఉన్న నిబంధనలు పాటించకపోవటం, వ్యర్థ రసాయనాలు గోదావరిలోకి వదలడం, అమ్మోనియా లీకేజ్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నోసార్లు విన్నవించినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీంతో నాలుగు రోజుల కిందట రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. టాస్క్ఫోర్స్ బృందం క్షేతస్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఇందులో నిబంధనలు పాటించడం లేదంటు ఆ బృందం నిర్ధారణకు వచ్చింది. ప్లాంట్‌లో యూరియా ఉత్పత్తి ని నిలిపివేయాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఆర్ఎఫ్సిఎల్ అధికారుల్లో ఆందోళన నెలకొంది.