వివాహిత అనుమానస్పద మృతి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆస్రా కాలనీలో నివాసం ఉంటున్న స్రవంతి (28) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అదిలాబాద్ జిల్లా బోథ్ కు చెందిన ఈమె రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. వెంకటేష్ అనే ఫొటోగ్రాఫర్ తో పెళ్లి జరిగింది. వీరికి నాలుగు నెలల చిన్నారి కూడా ఉంది. మృతురాలి శరీరంపై పలుచోట్ల దెబ్బల ఆనవాళ్ల ఉండడంతో కుటుంబ సభ్యులు భర్త చంపాడంటూ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.