రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టుగా అనిల్ భగత్
మందమర్రి పట్టణానికి చెందిన చురకలు పాత్రికేయుడికి రాష్ట్రస్థాయి ఉత్తమ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా మందమర్రి పట్టణ ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల సంజీవ్ ప్రజా సమస్యలు అందరి దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు దాని పరిష్కారానికి పోరాటం చేసేవాడే జర్నలిస్తు అన్నారు. భగత్ ఆ విషయంలో ముందుకు వెళ్తున్నారని అన్నారు. అనిల్ భగత్ “బ్రతకలేని అమ్మలకు బతుకమ్మ లేకపోయే” అని రాసిన కథనానికి పురస్కారం ప్రశంసా పత్రాలు లభించడం మందమర్రి పట్టణానికి గర్వకారణమని అన్నారు. కథనాన్ని ఆర్.ఎస్.ఎన్ సేవా ఫౌండేషన్ గుర్తించడం, తర్వాత సుందరయ్య విజ్ఞాన భవన్ లో సోమవారం వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా ప్రశంసా పత్రం అందజేసి శాలువాతో సన్మానించినట్లు తెలిపారు.