ఇన్స్టాలో వేధింపులు.. బాలిక బలి..
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టా గ్రాంలో వేధింపులకు ఓ బాలిక బలయ్యింది. ఆ వేధింపులతో 10వ తరగతి బాలిక మరణించింది. వివరాల్లోకి వెళితే.. ముస్లే సాక్షి (16) అనే బాలిక పేరిట ఇన్స్టా గ్రాంలో నకిలీ ఐడీలు తయారు చేశారు. ఐ వాంట్ జస్టీస్ అంటూ ఆమె పేరు మీద నకిలీ ఐడి తయారు చేశారు. అందులో నుంచి అసభ్యకరమైన సందేశాలు వస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రెండు రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను ఇబ్బందులకు గురిచేసిన వారిని, నకిలీ ఐడీలు క్రియేట్ చేసిన వారిని గుర్తించి శిక్షించాలని తన సూసైడ్ నోట్లో బాలిక సాక్షి పేర్కొంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.