మందమర్రి పీహెచ్సీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

మందమర్రి : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా మందమర్రిలో ఘనంగా నిర్వహించారు. ఉదయం జెండా ఆవిష్కరణ చేశారు. పీహెచ్సీ మెడికల్ అధికారి డాక్టర్ శైలజ పతాకావిష్కరణ చేశారు. వెల్నెస్ అధికారులు డాక్టర్ మానస, డాక్టర్ ప్రత్యూష, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటయ్యిందని వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.